లిక్కర్​  స్కాంలో.. ఎప్పుడు ఏం జరిగింది ?

లిక్కర్​  స్కాంలో.. ఎప్పుడు ఏం జరిగింది ?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న  ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేశాకె. పీఎం నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • 2021 జనవరి 5న లిక్కర్‌ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో ఓ కమిటీ
  • 2021 మే 21 న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం
  • 2021 జులై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ 
  • 2021 ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్​ఐఆర్ నమోదు
  • 2022 ఆగస్టు 17 ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై కేసు నమోదు
  • 2022 సెప్టెంబర్‌ 21న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు
  • 2022 సెప్టెంబర్‌ 27న ఈ కేసులో ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌నాయర్‌ను ఈడీ అరెస్టు .... ఈ స్కాంలో ఇదే మొదటి అరెస్టు. 
  • 2022 సెప్టెంబర్‌ 28న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌. 
  • 2022 అక్టోబర్‌ 10న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌. 
  • 2022 నవంబర్‌ 11న పి. శరత్‌చంద్రారెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్‌.
  •  2022 నవంబర్‌ 13న విజయ్‌ నాయర్‌ అరెస్ట్‌. 
  • 2022 నవంబర్‌ 26న ఈడీ తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు 
  •  సమీర్‌ మహేంద్రు కంపెనీల్లో రూ. 291 అక్రమ లావాదేవీలపై ఇందులో ప్రస్తావన. 
  • 2022 నవంబర్‌ 29న అమిత్‌ అరోరాను ఈడీ అరెస్టు
  • 2022 నవంబర్‌ 30 అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావన
  • 2022 డిసెంబర్‌ 2న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు 
  • 2022 డిసెంబర్‌ 3న ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలని కవిత సీబీఐకి లేఖ 
  • 2022 డిసెంబర్‌ 11న  కవితను ప్రశ్నించిన సీబీఐ. 
  • 2023 జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు. ..ఇందులో సౌత్‌గ్రూప్‌ నుంచి రూ. 100 కోట్ల ముడుపుల గురించి  ప్రస్తావన. 
  • ఈ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో 17 మంది పేర్లను చేర్చింది. ఈ స్కాం వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా 
  •  2023 ఫిబ్రవరి 2న సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యే కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. రౌస్‌ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ 
  • 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఇదే రోజు గౌతమ్‌ మల్హోత్రాను ఈడీ అరెస్టు 

ఈ కేసులో  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు.. అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పటికే ఈడీ ఎదుట రెండు మార్లు కవిత విచారణకు హాజరుకాగా.. ఆ తర్వాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీం ఈ నెల 19కు వాయిదా వేసింది.